News April 12, 2025

ఆసిఫాబాద్: ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్స్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని విద్యార్థులకు సూచించారు.

Similar News

News February 23, 2026

నల్గొండ: మైనారిటీల ఆర్థికాభివృద్ధికి గోల్డెన్ ఛాన్స్

image

మైనారిటీల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రెండు కీలక పథకాల కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లాలో ఆసక్తి గలవారు మార్చి 1 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి తెలిపారు. వెబ్‌సైట్ :http://tsobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 23, 2026

పత్తి కొనుగోళ్ల ప్రక్రియ పొడగింపు: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో సీసీఐ ద్వారా కొనసాగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియ గడువును పొడిగించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పత్తి సాగు చేసిన రైతుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ వద్ద ఉన్న దిగుబడిని ఈ నెల 27లోపు సమీప కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News February 23, 2026

తొలిరోజు 635 మంది గైర్హాజరు: ఆర్ఐఓ

image

అనంతపురం జిల్లాలోని 64 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ రమణ నాయక్ తెలిపారు. జిల్లాలో 22,848 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 22,213 మంది రాశారని చెప్పారు. వివిధ కారణాలతో 635 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు.