News January 15, 2026
ఆసిఫాబాద్: ఈ సర్పంచ్ GREAT..!

గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట కోసం సర్పంచ్ విద్యుత్ స్తంభమెక్కి నిబద్ధతను చాటుకున్నారు. పెంచికల్పేట్ మండలం పోతేపల్లిలో సంక్రాంతి పండుగ వేళ వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని సర్పంచ్ దుర్గం పోచన్న హామీ ఇచ్చారు. అయితే బుధవారం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమయం వృథా చేయకుండా ఆయనే స్వయంగా స్తంభమెక్కి దీపాలు అమర్చారు. నాయకుడికి ఉండాల్సింది హోదా కాదు, సేవా దృక్పథమని నిరూపించిన పోచన్నను గ్రామస్థులు కొనియాడారు.
Similar News
News January 23, 2026
ఎయిడెడ్ పోస్టుల భర్తీకి 25, 27న పరీక్షలు: DEO

గూడూరులోని SPS UP స్కూల్లో ఎయిడెడ్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు 25, 27వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను cre.ap.gov.in వెబ్సైట్ నుంచి తమ మొబైల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోలేని అభ్యర్థులు తిరుపతిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News January 23, 2026
జాన్‌పహాడ్‌లో నేడు పవిత్ర ‘గంధోత్సవం’

జాన్‌పహాడ్ సైదులు బాబా ఉర్సు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధోత్సవం శుక్రవారం వైభవంగా జరగనుంది. హైదరాబాద్ వక్ఫ్ బోర్డు నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంధాన్ని ముజావర్లు గుర్రంపై ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్తారు. ఈ వేడుకను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. కులమతాలకు అతీతంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
News January 23, 2026
ఖలిస్థానీల దుశ్చర్య.. త్రివర్ణ పతాకం తొలగింపు

క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంలోకి ఖలిస్థానీ మూకలు చొరబడ్డాయి. జాగ్రెబ్‌లోని ఎంబసీపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించాయి. ఆ స్థానంలో ఖలిస్థానీ జెండాను ఎగురవేశాయి. ఈ దుశ్చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.


