News January 2, 2026

ఆసిఫాబాద్: ఎస్పీ సీరియస్ అలర్ట్.!

image

ఆసిఫాబాద్ జిల్లాను కమ్మేస్తున్న దట్టమైన పొగమంచుపై పోలీస్ శాఖ స్పందించింది. రోడ్లపై మరణ మృదంగం మోగకుండా ఉండేందుకు ఎస్పీ నితిక పంత్ వాహనదారులను హెచ్చరించారు. వేగం తగ్గించడమే కాదు, తప్పక లైట్లు ఆన్ చేయాలన్నారు. “కనిపించని దారి – మితిమీరిన వేగం” ప్రాణాల మీదకు తెస్తుందన్నారు. భారీ వాహనదారులు రోడ్డు పక్కన ఆపేటప్పుడు ఇండికేటర్లు వాడాలని, అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు చెప్పారు.

Similar News

News February 16, 2026

క్లోరిన్ గ్యాస్ లీకేజీపై యంత్రాగం అప్రమత్తం: కలెక్టర్

image

బలిజిపేట మండలం అంపావల్లిలో జరిగిన క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే అప్రమత్తం అయిందని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. లీకేజీ ప్రభావంతో అస్వస్తతకు గురైన ఏడుగురిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, వైద్యాన్ని అందించారన్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు.

News February 16, 2026

మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

image

TG: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు వీరి ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హంగ్ ఏర్పడిన చోట ఏ ఒక్కటి చేజారనీయొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు పాల్గొన్నారు.

News February 16, 2026

పాలమూరు మేయర్ పీఠానికి ఫుల్ డిమాండ్!

image

పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్న, పార్టీ సీనియర్ నేత సిరాజ్ ఖాద్రి సతీమణి హజీరాబేగం, ఏకగ్రీవంగా ఎంపికైన రమ శ్రీనివాసరాజు మేయర్ పీఠానికి పోటీపడుతున్నారు. మేయర్ ఎంపిక విషయంలో నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదే అయినప్పటికీని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.