News December 28, 2024

ఆసిఫాబాద్: ఏడాదిలో 1207 కేసులు నమోదు

image

ఆసిఫాబాద్ జిల్లాలో గత సంవత్సరం కంటే హత్య కేసులు 45.45%, రోడ్డు ప్రమాదాలు 1.6% తగ్గాయని జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. SPవార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు. 2024లో జిల్లాలో 12 హత్య కేసులు, 82ఆస్తి సంబంధిత నేరాలు, 3నేర పూరిత నరహత్యలు, 04దొమ్మి కేసులు,18 కిడ్నాప్‌లు, 24 రేప్‌లు, 34 SC,STనేరాలు, 27పోక్సో,39 గంజాయి కేసులు, 188మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయాయన్నారు.

Similar News

News December 29, 2024

మైసూర్‌లో యాక్సిడెంట్.. మంచిర్యాల యువకుడు మృతి

image

కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల యువకుడు మృతి చెందాడు. దొరగారిపల్లెకు చెందిన బల్జిపెల్లి సందీప్ హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా సందీప్ స్నేహితులతో కలిసి శుక్రవారం కారులో మైసూర్ వెళ్లగా శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో సందీప్‌తో పాటు మరొకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సందీప్ మృతితో దొరగారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 29, 2024

నిర్మల్‌లో మహిళపై అత్యాచారం.. వివరాలు వెల్లడించిన సీఐ

image

నిర్మల్‌లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన వివరాలను టౌన్ సీఐ శనివారం వెల్లడించారు. శుక్రవారం బస్టాండ్‌లో కానిస్టేబుల్ అనిల్ విధులు నిర్వహిస్తుండగా ఆటో డ్రైవర్ స్పృహ కోల్పోయి ఉన్న మహిళ వివరాలు తెలపారు. వారు బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనను యోగేష్ అనే వ్యక్తి లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని తెలుపగా కేసు నమోదు చేశామన్నారు.

News December 29, 2024

‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విజయ డెయిరీ కేంద్రాలు’: ADB కలెక్టర్

image

తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో 85, పట్టణ ప్రాంతాల్లో 25 విజయ పాల విక్రయ కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కేంద్రాలకు విజయ సఖి పేరుతోనడుపుతున్నామన్నారు. శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విజయ సఖి నమూనా ఫ్రిడ్జ్‌ను ఆయన ఆవిష్కరించారు.  డెయిరీ డిడి మధుసూదన్ తదితరులు ఉన్నారు.