News March 6, 2026

ఆసిఫాబాద్: ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్

image

వేసవి ఎండల దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్‌లోనే ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. జిల్లాలోని 315 దుకాణాల ద్వారా 1,63,765 కార్డుదారులకు మొత్తం 10,559.229 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయనున్నారు. ఎండల తీవ్రత పెరగకముందే కోటా పంపిణీ పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

Similar News

News March 10, 2026

లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారు

image

TG: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారయ్యాయి. 3 ఏళ్ల LLB కోర్సుకు కనిష్ట ఫీజు ₹20వేలు, గరిష్టంగా ₹40,300, ఐదేళ్ల LLB కోర్సుకు ₹20 వేలు, ₹44,800గా ఫిక్స్ చేశారు. పీజీ లా కోర్సు ₹26,000, ₹50,400గా ఉంది. బీఈడీకి కనిష్టంగా ₹16,500, గరిష్ట ఫీజు ₹50,800, ఎంఈడీ కోర్సుకు ₹25వేలు, ₹45వేలుగా నిర్ణయించారు. 2027-28 అకడమిక్ ఇయర్ వరకు ఇవే ఫీజులు ఉండనున్నాయి.

News March 10, 2026

సమ్మర్‌లో కరెంట్ బిల్ తగ్గాలంటే!

image

✦ ఫిలమెంట్ బల్బులు, ట్యూబ్ లైట్ల బదులు LED బల్బులు వాడాలి
✦ AC టెంపరేచర్‌ను 24-26°C మధ్య సెట్ చేయాలి. ఒక్క డిగ్రీ పెంచితే సుమారు 6% కరెంటు ఆదా
✦ AC ఆన్‌లో ఉండగా తక్కువ స్పీడ్‌లో ఫ్యాన్ కూడా ఆన్‌లో ఉంచితే రూమ్ త్వరగా చల్లబడుతుంది
✦ AC ఎయిర్ ఫిల్టర్‌ను 15 రోజులకోసారి శుభ్రం చేయాలి
✦ TV, ల్యాప్‌టాప్ ఛార్జర్, మైక్రోవేవ్ వంటివి స్టాండ్‌బై మోడ్‌లోనూ విద్యుత్ వాడతాయి. వాటిని ఆఫ్ చేయాలి

News March 10, 2026

MHBD: మే నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి: కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 3,682 ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మార్చి చివరికి 2వేల ఇళ్లు, మే నాటికి మిగిలిన ఇళ్ల గృహప్రవేశాలు చేయించాలని అధికారులకు సూచించారు. హౌసింగ్, మున్సిపల్, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై కూడా దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో పాల్గొన్నారు.