News March 2, 2025
ఆసిఫాబాద్: గెలుపుపై ఎవరి అంచనాలు వారివే..

ఉమ్మడి ADB, KNR, MDK, NZB, పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్‌లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
Similar News
News November 4, 2025
APPLY NOW: NRDCలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<
News November 4, 2025
ఉప్పలగుప్తం: నాచుతో డబ్బులే డబ్బులు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలను సముద్రపు నాచు పెంపకానికి ఎంపిక చేసినట్లు అమృతానంద విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమృత నటరాజన్ తెలిపారు. నాచును ఆహారంగా తీసుకుంటున్న జపాన్ దేశస్థుల ఆయుష్షు పెరిగినట్టు సర్వేలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఉప్పలగుప్తం(M) వాసాలతిప్పలో సోమవారం మత్స్యకారులకు నాచు పెంపకంపై అవగాహన కల్పించారు. ఎరువులు వాడకుండానే 45 రోజులకు నాచు ఉత్పత్తి వస్తుందని వివరించారు.
News November 4, 2025
రేపు కడపకు రానున్న AR రెహమాన్

ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించే గంధం వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన వస్తుంటారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం వేడుకలకు పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.


