News February 26, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. మొత్తం జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాల వద్దకు ఎన్నికల సామగ్రి తరలిస్తున్నట్లు వెల్లడించారు.మొత్తం 6వేల 607 మంది ఓటర్లు ఉన్నారు.

Similar News

News February 27, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 27, 2025

స్టార్ కపుల్ మధ్య వివాదం.. కేసులు నమోదు

image

మహిళా బాక్సర్ సావీటీ బూరా తన భర్త, మాజీ కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వరకట్నం కోసం వేధించారని సావీటీ ఫిర్యాదు చేయడంతో హరియాణా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పుట్టింటి నుంచి SUV, రూ.కోటి తేవాలని తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. సావీటీపై హుడా కూడా కేసు పెట్టారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కాగా హుడా(2020), సావీటీని(2025) కేంద్రం అర్జున అవార్డులతో సత్కరించింది.

News February 27, 2025

జనగామ: నేడు డయల్ యువర్ డీఎం

image

ఆర్టీసీ జనగామ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ తమ సమస్యలతో పాటుగా సూచనలను తెలియజేయాలన్నారు. 9959226050 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

error: Content is protected !!