News October 18, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణీ దారుణ హత్య

ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణి మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దహెగాం మండలం గేర్రె గ్రామంలో కోడలు రాణిని మామ సత్తయ్య దారుణంగా హత్య చేశాడు. కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో హత్య చేసి ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 18, 2025
జూబ్లీహిల్స్ కోసం 40 ‘హస్త్రాలు’

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ 40 అస్త్రాలు ప్రయోగిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా నియమించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. AICC స్టేట్ ఇన్‌ఛార్జీ, CM, డిప్యూటీ CM, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులతో కూడిన 40 మందిని ప్రచారం కోసం నియమించడం విశేషం. ఒక్క MLA స్థానం కోసం కాంగ్రెస్ ఉద్దండులు అంతా బరిలోకి దిగుతుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది.
News October 18, 2025
దౌల్తాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిచెందాడు. దౌల్తాబాద్ మండలంలోని కొనాయపల్లికి చెందిన బక్కోళ్ల కృష్ణ(32) బైక్‌పై దౌల్తాబాద్ నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో శేర్‌పల్లి బందారం గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సంపేట సమీపంలో మొండిచింత వద్ద బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో కృష్ణ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.