News February 18, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో టాప్ వార్తలు

1.ASF 34వ సబ్ జూనియర్ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక2.ఎల్లారం పరిసరాల్లో పెద్దపులి సంచారం3.SKZR: ఏడుగురికి గాయాలు.. RSP పరామర్శ4.చింతలమానేపల్లిలో 55 లీటర్ల గుడుంబా స్వాధీనం5.సాలెగూడలో ఐదుగురిపై కేసు నమోదు6. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
Similar News
News November 2, 2025
సంగెం: గుంతలో పడి వృద్ధుడి మృతి

సంగెం మండలం లోహిత గ్రామంలోని నల్లాల గేట్‌వాల్ సమీపంలో ఉన్న గుంతలో పడి గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 ఏళ్లు) మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News November 2, 2025
రాజకీయ హింస.. ఏడాదిలో 281 మంది మృతి

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటికీ పొలిటికల్ వయలెన్స్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది AUG నుంచి ఈ ఏడాది SEP వరకు అల్లర్లలో 281 మంది మరణించారని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. అలాగే అక్రమ నేరారోపణలతో 40 మంది చట్టవిరుద్ధ హత్యలకు గురయ్యారని తెలిపింది. మరో 153 మందిని దారుణంగా ఉరితీశారని పేర్కొంది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జవాబుదారీగా ఉండటం లేదని అభిప్రాయపడింది.
News November 2, 2025
విజయనగరం నుంచి పంచారామాలకు

కార్తీక మాసం పురష్కరించుకుని పంచారామాలు భక్తులు దర్శించుకోవడానికి విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు డీఎం జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పంచా రామ పుణ్యక్షేత్రాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆదివారం రెండు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరాయన్నారు. వచ్చే వారం వెళ్లాలనుకునేవారు సిబ్బందిని సంప్రదించాలని కోరారు.


