News February 27, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాగా గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన ఓటింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. పట్టభద్రులు 20.3%, ఉపాధ్యాయుల 45.1% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రతి ఓటు కీలకమే..!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS మధ్య థగ్ ఆఫ్ వార్ పోటీ నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటు కీలకం కానుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో 42 టేబుల్స్‌పై 10 రౌండ్లలో కౌంటింగ్ జరగనుండగా ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 4,01,365 ఓట్లు ఉండగా అందులో 1,94,631 మంది ఓటేశారు. ఏ పార్టీ గెలిచినా మెజార్టీ ఎక్కువ ఉండదనే చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

News November 14, 2025

ఈనెల 25వ తేదీలోగా ఫీజు చెల్లించాలి: డీఈఓ

image

పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 25వ తేదీ లోపు చెల్లించాలని నంద్యాల డీఈఓ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గడువు లోపు ఫీజు చెల్లించకపోతే రూ.50 రుసుంతో వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ.200 రుసుంతో 10వ తేదీ, రూ.500 రుసుంతో 15వ తేదీ వరకు చెల్లించాలని వివరించారు.

News November 14, 2025

వరంగల్: సారూ.. నేను అక్షరం ముక్క చదవలేదు..!

image

‘నేనో కౌలు రైతును. నేను అక్షరం ముక్క చదవలేదు. నా దగ్గర సెల్‌ఫోన్‌ కూడా లేదు. అలాంటప్పుడు యాప్‌లో పత్తి ఎలా అమ్మగలను? రెండెకరాల్లో పండించాను. పట్టా పాస్‌బుక్‌ యజమాని దగ్గరే ఉంది. ఏం చేయాలో ఎవరూ చెప్పట్లేదు’ ఇలాంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక మంది రైతులది. సీసీఐ, కపాస్‌ యాప్‌ నిబంధనలతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పత్తి అమ్మకానికి స్మార్ట్‌ఫోన్‌, యాప్‌ బుకింగ్‌ తప్పనిసరి చేశారు.