News December 16, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో నేడు, రేపు స్థానిక సెలవు

image

స్థానిక సంస్థల మూడవ దశ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మంగళ, బుధవారం జిల్లాలో స్థానిక సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న జరిగే మూడవ దశ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. దీంతో నేడు, రేపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ఉంటుందన్నారు.

Similar News

News December 19, 2025

పంచాయితీ ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ భేష్‌

image

కరీంనగర్ జిల్లాలో మూడు దశల పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, రాష్ట్రంలోనే ముందుగా పూర్తి చేసినందుకు కలెక్టర్ పమేలా సత్పతిని టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకులు కలిసి అభినందించారు. ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా యంత్రాంగం సమర్థంగా పనిచేసిందని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ కాళీచరణ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.

News December 19, 2025

కృష్ణా జిల్లాలో 15 మందికి కారుణ్య నియామకాలు

image

అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డీకే బాలాజి కొత్తగా కారుణ్య నియామకాల కింద నియమితులైన ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం ఉదయం తన చాంబర్‌లో 15 మందికి కారుణ్య నియామకాల కింద నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మీకు అప్పగించిన పనులను సజావుగా నిర్వహించాలన్నారు.

News December 19, 2025

గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపేసిన ట్రంప్

image

గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. ‘బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపిన క్లాడియో మాన్యుయెల్ 2017లో డైవర్సిటీ లాటరీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ద్వారా USలోకి వచ్చాడు. తర్వాత గ్రీన్ కార్డు పొందాడు. ఇలాంటి దారుణమైన వ్యక్తులను దేశంలోకి అనుమతించకూడదు’ అని పేర్కొన్నారు.