News April 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

ఆసిఫాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ కారణంతో చికెన్ ధరలు తగ్గిపోయాయి. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ ధరలు ఊపందుకున్నాయి. దీంతో ప్రజలు చికెన్ కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత నెలలో కేజీ చికెన్ ధర రూ. 120 ఉండగా ప్రస్తుతం దాని ధర రూ. 240కు చేరుకుంది.
Similar News
News April 2, 2025
మేడ్చల్‌లో చల్లబడింది.. వర్షం కురిసే CHANCE

మేడ్చల్ వాతావరణంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గరిష్ఠంగా 37.7 డిగ్రీలు నమోదైంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షం రైతులకు ఊరట కలిగించనుంది. అయితే రోడ్లపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో వెదర్ చల్లబడింది. స్థానికంగా చల్లని గాలులు వీస్తున్నాయి. మీ ప్రాంతంలో ఎలా ఉంది కామెంట్ చేయండి.
News April 2, 2025
సుంకాల ప్రభావం.. భారత్‌లో తగ్గనున్న బంగారం ధరలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న సుంకాలతో భారత్‌లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. $11.88 బిలియన్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తుండగా వీటిపై ట్రంప్ 13.3% సుంకం విధించనున్నారు. దీని ప్రభావంతో భారత్‌లో నగలు, ఖరీదైన ఆభరణాలు చౌక కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎలక్ట్రానిక్ పరికరాలపై సుంకం పెరగడంతో మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
News April 2, 2025
స్టేట్ టాప్‌గా కామారెడ్డి ఆర్టీఏ

రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి ఆర్టీఏ రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచిందని డీటీఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేశారు. గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈ సారి రూ.73 కోట్లకు రూ.68.19 కోట్లు (92.4%) వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో సిబ్బంది ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు.