News January 31, 2026
ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు యాక్ట్-1861లోని సెక్షన్ 30, 30(A) కింద ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా పొందాలని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News February 3, 2026
ప్రకాశం: యాక్సిడెంట్.. విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థి వి. గాలెయ్య మృతి చెందగా మరో యువకుడు గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. కొలుకుల నుంచి ఎర్రగొండపాలేనికి వస్తున్న సమయంలో వరి కోత వాహనం ఢీకొని అక్కడిక్కడే గాలెయ్య మృతి చెందగా.. సండ్రపాటి నాని (16) గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
News February 3, 2026
స్వామి వారి ప్రతిష్ట.. భక్తుల మనోభావాలను పట్టించుకోండి…!

కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో కల్తీ నెయ్యి ఘటనపై సుప్రీంకోర్టు ఎలాంటి రాజకీయ మాటలు వద్దని స్పష్టం చేసింది. కేసు మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటీ నుంచి రాష్ట్ర రాజకీయం తిరుమల లడ్డూ మీదుగా సాగుతుంది. నేతలు వారి ప్రయోజనాల కోసం స్వామివారి ప్రతిష్టను, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ వివాదానికి స్వస్తి పలకాలని కోరుతున్నారు.
News February 3, 2026
బాపట్ల: పది పరీక్షలకు 82 కేంద్రాలు

బాపట్ల జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయని మంగళవారం DEO కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 82 పరీక్ష కేంద్రాలలో మొత్తం 15,944 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 7,967 మంది బాలికలు, 7,977 మంది బాలురు ఉన్నట్లు వివరించారు. మార్చి 3 నుంచి ఇంటర్, మార్చి 16 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి.


