News April 1, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో భానుడి భగభగ

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో రోజూ 38 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం 10 దాటితే రోడ్లన్ని నిర్మాణుష్యాన్ని తలపిస్తున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News April 2, 2025

ఎకరానికి రూ.31,000: మంత్రి ప్రకటన

image

AP: రిలయన్స్ <<15966046>>CBG ప్లాంట్లతో<<>> ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. గుజరాత్ కంటే ఏపీలోనే రిలయన్స్ ఎక్కువగా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందన్నారు. వీటి ద్వారా బంజరు భూములు వినియోగంలోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూములకు రూ.31వేలు కౌలు చెల్లిస్తామన్నారు. కందుకూరులో ఇండోసోల్ ప్లాంట్, BPCL అందుబాటులోకి రానున్నాయన్నారు.

News April 2, 2025

నెల్లూరు: రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం

image

నెల్లూరు జిల్లాలో బిట్రగుంట-పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించిన దొంగల ముఠా రెండు రైళ్లను ఆపి దోపిడీ చేసింది. అర్ధరాత్రి సమయంలో బెంగళూరు, చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపారు. బోగీల్లోకి ప్రవేశించి మహిళల మెడలోని బంగారం గొలుసులు, బ్యాగులను దోచుకెళ్లారు.

News April 2, 2025

ADB: వేధింపులా.. 8712659953కి కాల్ చేయండి: SP

image

మహిళలు, విద్యార్థినులకు ఉద్యోగస్థలాల్లో, కళాశాలల్లో ఎలాంటి సమస్యలున్నా, వేధింపులకు గురైనా జిల్లా షీ టీం బృందాలను సంప్రదించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. షీ టీం బృందాలను సంప్రదించడానికి 24 గంటలు పని చేసేలా ఒక మొబైల్ నెంబర్ 8712659953ను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో గత నెలల్లో 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటిలో 3 కేసులు, మావల పీఎస్‌లో ఒక FIR నమోదు చేసినట్లు చెప్పారు.

error: Content is protected !!