News April 22, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో యాక్సిడెంట్

image

తిర్యాణి మండలం గిన్నెదరిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిను యువకుడు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 22, 2025

దొంగల కదలికల భయంతో నిద్రలేని గ్రామం

image

పెదనందిపాడు మండలానికి చెందిన పరిటలవారిపాలెం గ్రామంలో రెండు రోజులుగా దొంగల కదలికలతో గ్రామస్థులు భయంతో గడుపుతున్నారు. రాత్రివేళల్లో ఇంట్లోకి చొరబడి దొంగిలించేందుకు దొంగలు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి గ్రామస్థులు కర్రలు పట్టుకుని రాత్రి వేళ కాపలా కాశారు. పోలీసుల గ్రామానికి భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.

News April 22, 2025

నరసరావుపేటలో గంజాయి తాగి వ్యక్తి హల్చల్

image

నరసరావుపేటలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రజలు వాపోతున్నారు. సోమవారం రాత్రి బరంపేట స్కూల్ వద్ద తనకు గంజాయి కావాలంటూ దుకాణంలో ప్రవేశించి మహిళను బెదిరిస్తూ యువకుడు హల్చల్ చేశాడు. తమ వద్ద గంజాయి లేదని చెప్పినా వినిపించుకోకుండా మహిళతో పాటు వారి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. వారించిన స్థానికులపై రాళ్లతో దాడి చేసి భయాందోళనకు గురిచేశాడు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

News April 22, 2025

అనకాపల్లిలో జాబ్ మేళా

image

అనకాపల్లి పట్టణం గవరపాలెం ఏడీ స్కూల్లో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధికారి గోవిందు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అయ్యే జాబ్ మేళాలో 16 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!