News January 2, 2026
ఆసిఫాబాద్ జిల్లాలో రూ.2.25 కోట్లు తాగేశారు

నూతన సంవత్సర వేడుకల వేళ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఆసిఫాబాద్ జిల్లాలో డిసెంబర్ 31న ఒకరోజు రూ. 2,25,00,000 విలువైన మద్యం తాగేశారు. ఉట్నూర్ ఐఎంఎల్ డీపో నుంచి 30, 31 తేదీలలో
భారీగా మద్యాన్ని కొనుగోలు చేశారు. డిసెంబర్ నెలలో మొత్తం రూ.36 కోట్ల మద్యం అమ్మకాలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రూ. 2.25 కోట్ల మద్యం లాగించేశారు.
Similar News
News February 17, 2026
దారుణం.. రైలులో యువతిపై TTE అత్యాచారం

అహ్మదాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. NCC క్యాడెట్ పరీక్ష రాసి వెళ్తున్న యువతిపై TTE రాహుల్ అత్యాచారం చేశాడు. రద్దీ ఎక్కువ ఉండటంతో ఆమె టికెట్ తీసుకోకుండా ఏసీ కోచ్ ఎక్కింది. సీటు ఇప్పిస్తానని చెప్పి TTE క్యాబిన్‌కు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఆ తర్వాత బాధితురాలు 112కు ఫోన్ చేయడంతో నిందితుడు డియోరియా స్టేషన్‌లో దిగి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
News February 17, 2026
రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

AP: వరద నీటి నుంచి అమరావతి రక్షణకు రూ.595.01 కోట్లతో 2వ ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉండవల్లి వద్ద 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో ఇది ఏర్పాటు కానుంది. సర్వే, డిజైన్, నిర్మాణం, 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టు సంస్థదేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా కొండవీటి వాగుపై ఉండవల్లి వద్ద 5000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఒక వరదనీటి పంపింగ్ స్టేషన్ ఉంది.
News February 17, 2026
వ్యవసాయ రంగానికి పూర్తిగా సౌర విద్యుత్తు!

TG: రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సౌర విద్యుత్ అందించాలని GOVT నిర్ణయించింది. ముందుగా నల్గొండ జిల్లా అనుముల, కనగల్, ముదిగొండలను సౌర గ్రామాలుగా మారుస్తారు. దీనికోసం సోలార్ పవర్ స్టేషన్ ఏర్పాటుకు ₹100 CR కేటాయించారు. అక్కడి 2వేల అగ్రి కనెక్షన్లను ఈ స్టేషన్‌కు అనుసంధానిస్తారు. క్రమేణా ఇతర ప్రాంతాల్లో సోలార్ స్టేషన్లు నెలకొల్పి 5 ఏళ్లలో వ్యవసాయ కనెక్షన్లన్నిటికీ సౌర విద్యుత్ అందిస్తారు.


