News March 5, 2026
ఆసిఫాబాద్ జిల్లాలో విద్యుత్ సరఫరా బలోపేతం: ఎస్ఈ

ASF జిల్లాలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే తెలిపారు. జిల్లాకు మంజూరైన 14 ట్రాన్స్‌ఫార్మర్లలో 7 ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పారు. ఓవర్‌లోడ్ నియంత్రణకు ఏబీ స్వీచ్‌లు అమర్చుతున్నామని పేర్కొన్నారు. దహెగాం, గుండాయపేట్, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో 33 కేవీ లైన్లకు కవర్ కండక్టర్లు అమర్చి 70 కి.మీ కేబుల్ వేసినట్లు తెలిపారు.
Similar News
News April 5, 2026
రాజంపేట: జాతర ఎప్పుడో తెలియదు.. జెయింట్ వీల్ వచ్చేసింది

రాజంపేటలో ప్రసిద్ధి చెందిన బలిజపల్లి గంగమ్మ జాతర ఎప్పుడు అనేది ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. ఈరోజు, ఆరోజు అంటూ పుకార్లు షికార్లు చేస్తుండడంతో భక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సంప్రదాయం ప్రకారం ఆ ప్రాంతంలోని కొన్ని కుటుంబాలకు మాత్రమే జాతర నిర్వహణ బాధ్యతఉంది. అందువల్ల ప్రతి ఏడాది ఇదే తంతు నడుస్తోంది. జాతర ఉంటుందని నమ్మి ఈ ఆదివారం వ్యాపారులు జెయింట్ వీల్ తీసుకొచ్చారు.
News April 5, 2026
శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డీఎస్పీ వివేకానంద పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత దేశ ఉప ప్రధాని అని అన్నారు. దళిత వర్గాల ఆశాజ్యోతి అని, వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.
News April 5, 2026
చెన్నూరు ఇటుక బట్టీలపై అధికారుల కొరడా

చెన్నూరు క్రాసింగ్ వద్ద ఇటుక బట్టీల పొగ, బూడిదతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ, కంటి వ్యాధుల ముప్పు ఉందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. నిబంధనల ప్రకారం జనావాసాలకు, హైవేకి 500 మీటర్ల దూరంలో బట్టీలు ఏర్పాటు చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో కిరణ్ మోహన్‌రావు తదితరులు యజమానులకు నోటీసులు జారీ చేశారు.


