News February 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

శాంతిభద్రతల దృష్ట్యా ఆసిఫాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 28 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలని కోరారు.
Similar News
News November 10, 2025
ఇల్లెందులో విషాదం.. 3 నెలల గర్భిణీ మృతి

ఇల్లెందు మండలం లచ్చగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం వివాహమైన అంజలి (20) అనే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మూడు నెలల గర్భిణీ అయిన అంజలి, ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కుమార్తె ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
సిద్దిపేట: ప్రజావాణికి 200 దరఖాస్తులు

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌లతో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 200 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News November 10, 2025
జగిత్యాల: బాధితుల నుంచి 14 అర్జీల స్వీకరణ

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో SP మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమన్నారు.


