News February 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

శాంతిభద్రతల దృష్ట్యా ఆసిఫాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 28 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలని కోరారు.
Similar News
News February 26, 2026
పింఛన్ల పెంపుపై BIG UPDATE

TG: చేయూత పింఛన్లను తొలుత రూ.500 పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులకు ₹2,016, దివ్యాంగులకు ₹4,016 చొప్పున ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతి నెలా ₹950కోట్ల వరకు ఖర్చవుతోంది. ₹500 పెంచితే ఏటా ₹2,500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఆర్థిక పరిస్థితిని బట్టి ఎన్నికల నాటికి దశలవారీగా పింఛన్లను ₹4వేలు, ₹6వేలకు పెంచాలని యోచిస్తోంది.
News February 26, 2026
చాహత్‌కు అదనపు బాధ్యతలు.. ఎన్నికలే కారణమా?

హనుమకొండ కలెక్టర్‌గా బదిలీ అయిన చాహత్ బాజ్‌పాయ్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆమె చూస్తున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను కూడా అదనంగా కొనసాగించనున్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికలు, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తనదైన ముద్ర వేసిన చాహత్, కలెక్టర్‌గా పని దొంగల పని పడతారని నగరవాసులు ఆశిస్తున్నారు.
News February 26, 2026
ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ బదిలీ

ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయనను వికారాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆసిఫాబాద్‌లో తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన, త్వరలోనే వికారాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.


