News January 23, 2026

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు ప్రతిజ్ఞ

image

ఓటు ప్రాధాన్యం గురించి ప్రతిఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరముందని, 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ASF కలెక్టర్ హరిత సూచించారు. ASF కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందితో కలెక్టర్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News April 14, 2026

మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

image

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

News April 14, 2026

TU: రేపటి నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ(8,10 సెమిస్టర్) పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీ కలశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10-12గం.ల వరకు జరుగుతాయన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలని ఆయన తెలిపారు.

News April 14, 2026

గుంటూరు: దరఖాస్తు గడువు పొడిగింపు

image

గుంటూరు జిల్లాలో 38 బ్యాక్‌లాగ్ పోస్టుల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వెంకటరమణప్ప సోమవారం తెలిపారు. ఇందులో టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు సీపీటీ (CPT) పాసై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాల కోసం https://guntu-rap.in/dw2026 వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.