News March 17, 2025

ఆసిఫాబాద్ జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. నిరుద్యోగులు tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. వివరాలకు ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

Similar News

News January 9, 2026

ప్రకాశం: లోన్ తీసుకున్నారా.. అసలు కడితే చాలు.!

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు SC కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అలాంటి వారికోసం ప్రస్తుతం వడ్డీ పూర్తి రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.

News January 9, 2026

IOCLలో 509 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) ఈస్ట్రన్ రీజియన్‌లో 509 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్, డిప్లొమా(ఇంజినీరింగ్), ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు NATS/NAPS పోర్టల్‌లో సాయంత్రం 5 గంటలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com/

News January 9, 2026

సంగారెడ్డి: ఉమ్మడి జిల్లాలో మహిళలదే పై చేయి

image

మున్సిపాలిటీ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. దీని ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 19 మున్సిపాలిటీల్లో మొత్తం 5,43,103 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,73,219 మంది కాగా, పురుష ఓటర్లు 2,69,432 మంది ఉన్నారు. ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు 3787 మంది ఎక్కువగా ఉన్నారు.