News March 29, 2025

ఆసిఫాబాద్ జిల్లా న్యాయమూర్తిని సన్మానించిన ఎస్పీ

image

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అసిస్టెంట్ సెషన్ జడ్జ్ యువరాజును ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు శాలువాతో సన్మానించినారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసులతో నిర్వహించిన ఓ సదస్సుకు హాజరైన ఆయనను శాలువాతో సన్మానించినట్లు తెలిపారు. వీరితో జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర రావు, ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు కరుణాకర్, రామానుజం, రమేష్, సీఐలు, ఎస్ఐ‌లు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

నీ వాటా ఎంత పవన్ కళ్యాణ్: వైసీపీ

image

యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌పై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. ‘పవన్ పీఏ, జనసేన ఎమ్మెల్యే మధ్య పంపకాల్లో తేడాలు, రూ.350 కోట్లు విలువైన భూమిని సెటిల్‌మెంట్ చేసిన పవన్ పీఏ.. వాటా కోసం ఎగబడిన యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. బాధితుల్ని గాలికి వదిలేసి.. గుట్టుచప్పుడు కాకుండా సయోధ్యకి పవన్ ప్రయత్నిస్తున్నారు’. ఇందులో నీ వాటా ఎంత అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేసింది.

News November 15, 2025

ఖమ్మం: అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

image

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరం వైరారోడ్ లోని ఎస్.ఆర్ గార్డెన్స్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అవగాహనతో డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చని చెప్పారు. మధుమేహంపై నిర్లక్ష్యం వహిస్తే ఇది శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తుందన్నారు.

News November 15, 2025

ఢిల్లీ పేలుళ్ల ఘటన… అల్ ఫలాహ్ వర్సిటీపై కేసులు

image

ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో ఢిల్లీ పోలీసులు హరియాణా అల్ ఫలాహ్ వర్సిటీపై 2 కేసులు నమోదు చేశారు. UGC, NAACలు వర్సిటీ అక్రమాలను గుర్తించిన తదుపరి మోసం, ఫోర్జరీ, తప్పుడు అక్రిడిటేషన్‌‌లపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా పేలుళ్లకు నేరపూరిత కుట్రకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ వర్సిటీపై ఇంతకు ముందు ఒక కేసును నమోదు చేశారు. పేలుళ్ల నిందితుల వివరాలు సేకరించి విచారిస్తున్నారు.