News July 12, 2024
ఆసిఫాబాద్: ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక టీమ్‌లు: ఎస్పీ

జిల్లాలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఆసిఫాబాద్, కాగజ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు జిల్లాలో 10మంది పోలీస్ సిబ్బంది చొప్పున 2టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా SP,DV.శ్రీనివాస్ రావు తెలిపారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ప్రత్యేక టీంల ద్వారా ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 17, 2026
కాగజ్‌నగర్‌లో SP అఖిల్ తనిఖీలు

కాగజ్‌నగర్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తనిఖీ చేసి బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ తెలిపారు.
News February 16, 2026
BREAKING: కాంగ్రెస్‌లోకి ADB మున్సిపల్ ఛైర్‌పర్సన్

ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన దేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన బండారి అనూష సోమవారం నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
News February 16, 2026
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి: ADB కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రోటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు.


