News February 28, 2026
ఆసిఫాబాద్: డిగ్రీ విద్యార్థి సూసైడ్

రెబ్బెన (M) దుర్గాపూర్‌కు చెందిన మడావి అజయ్(18) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వెంకట కృష్ణ కథనం ప్రకారం.. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అజయ్ 2 సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. గత నెల 27న వైద్యం కోసమని వెళ్లి గ్రామ శివారులో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా శుక్రవారం మృతి చెందాడు.
Similar News
News February 28, 2026
కరీంనగర్ ప్రగతికి ‘త్రిశూల’ వ్యూహం!

కరీంనగర్ అభివృద్ధి ఇప్పుడు ముగ్గురు నాయకులపై ఆధారపడి ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘స్మార్ట్ సిటీ’ నిధులపై పట్టు సాధిస్తుండగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఈ ముగ్గురు కీలక నేతలతో నగరం రూపురేఖలు మారుతాయా లేదో చూడాలి.
News February 28, 2026
చిలుకూరు ఆలయానికి వన్నె తెచ్చింది ఆయనే!

చిలుకూరు బాలాజీ దేవాలయానికి ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ వన్నె తెచ్చారు. HYDకు కూతవేటు దూరంలో మొయినాబాద్ మం.చిలుకూరులో ఉన్న బాలాజీ గుడికి 2000 సంవత్సరం వరకు పెద్దగా ప్రాచుర్యంలేదు. సౌందరరాజన్ ఉద్యోగ విరమణ తర్వాత ఆలయానికి వచ్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. అప్పటి వరకు ఉత్సవాల సమయంలోనే భక్తులు వచ్చేవారు. స్వయం ప్రతిపత్తి దేవాలయంగా ప్రకటించి హుండీ, కానుకలు, టికెట్లు లేకుండా ఆలయాన్ని నడిపించారు.
News February 28, 2026
సిద్దిపేట: UDID మెడికల్ క్యాంపులు

సిద్దిపేట జిల్లాలోని దివ్యాంగుల కోసం మార్చి నెల UDID మెడికల్ క్యాంపుల షెడ్యూల్‌ను వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. లోకోమోటర్, వినికిడి, దృష్టి లోపం, మానసిక వైకల్యం ఉన్న వారికి నిర్దిష్ట తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, సదరు ధృవపత్రాలతో క్యాంపునకు హాజరుకావాలని అధికారులు సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


