News March 5, 2025

ఆసిఫాబాద్: పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ 

image

ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే బుధవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రహరీ, భద్రతా అంశాలను పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించడంతోపాటు ఎండల దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 12, 2025

విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

image

H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటమార్చారు. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.

News November 12, 2025

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

image

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<>TISS<<>>) 2 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBDలకు రూ.125. వెబ్‌సైట్: https://tiss.ac.in

News November 12, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో 255 కేంద్రాలు ఏర్పాటు చేశామని, సెంటర్లలో అన్ని వసతులు సౌకర్యం కల్పించామన్నారు.