News February 2, 2025
ఆసిఫాబాద్: పర్యాటక రంగ అభివృద్ధికి కృషి: రామకృష్ణ
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు ప్రాజెక్టు అధికారి రామకృష్ణ తెలిపారు. ఆదివారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ఆధ్వర్యంలో అడ ప్రాజెక్టు వద్ద నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్‌ను జె.డి.ఎం. నాగభూషణం, ఆసిఫాబాద్ వెలుగు మహిళా మండల సమాఖ్య ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
Similar News
News February 2, 2025
SHOCKING: భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య!
ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉంది. అయినా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతడితో కలిసి పారిపోవాలనుకుంది. అలా వెళ్లిపోతే ఒకెత్తు. కానీ మరీ అన్యాయంగా భర్త కిడ్నీని భర్తతోనే విక్రయింపచేసింది. కూతురి జీవితానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని నమ్మబలికింది. ఆమెను నమ్మిన భర్త కిడ్నీ అమ్మేసి రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైందా ఇల్లాలు. బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
News February 2, 2025
ట్రంప్‌తో ప్రధాని మోదీ మాట్లాడాలి: కాంగ్రెస్ నేత భార్గవ్
దేశంలో విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రగతి లేక సంపన్నులు దేశం వదిలిపోతున్నారని విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడు వల్లూరు భార్గవ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడి అమెరికాలో ఉన్న భారతీయులకు అక్కడ సౌకర్యాలు కల్పించాలని తేదా ఇక్కడ అభివృద్ధిని గురించి అర్థమయ్యేలా చెప్పి వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
News February 2, 2025
అభిషేక్ ఇన్నింగ్సుపై యువరాజ్ ట్వీట్
ఇంగ్లండ్‌పై దండయాత్ర చేసిన భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను అతని కోచ్, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ప్రశంసల్లో ముంచెత్తారు. అద్భుతంగా ఆడావని కొనియాడారు. ఇదే ఆటను తాను చూడాలనుకున్నానని, గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ మ్యాచులో 37 బంతుల్లో సెంచరీ చేసిన అభి, మొత్తంగా 54 బాల్స్‌లో 13 సిక్సర్లతో 135 రన్స్ చేశారు.