News January 17, 2026

ఆసిఫాబాద్: పెళ్లయిన రెండు నెలలకే యువకుడి మృతి

image

సంక్రాంతి ఆ ఇంట్లో తీరని శోకాన్ని నింపింది. గురువారం సంగారెడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ASF జిల్లా కెరమెరి వాసి సంతోశం(32) మృతి చెందాడు. ఏడుపాయల దర్శనం ముగించుకుని వస్తుండగా, గేదెను తప్పించబోయి కారు చెట్టును ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. నవంబర్‌లో రెబ్బెనకు చెందిన శ్రావణితో వివాహమైంది. దీంతో తల్లిదండ్రులు, భార్య శ్రావణి కన్నీరుమున్నీరవుతున్నారు. స్నేహితులకు స్వల్ప గాయాలయ్యాయి.

Similar News

News February 18, 2026

తిరుపతిలో లిఫ్ట్ ఇస్తే చైన్ కొట్టేశాడు..!

image

తిరుపతి రూరల్ పేరూరుకు చెందిన రఘునాథ్ రెడ్డి(36) బైకుపై వెళ్తుండగా చెర్లోపల్లిలోని వైన్ షాపు వద్ద ఓ వ్యక్తి లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకున్నాడు. పాస్ వస్తుందని జూపార్క్ సమీపంలో బైకు ఆపాలని కోరాడు. తిరిగి బైక్ ఎక్కే సమయంలో రఘునాథ రెడ్డి మెడలోని 18 గ్రాముల బంగారు చైన్‌ను అతడు లాక్కెళ్లిపోయాడు. నిందితుడు వైట్ కలర్ టీ షర్ట్‌పై బ్లూ కలర్ జాకెట్ ధరించి ఉన్నాడు. అతడిని గుర్తిస్తే చెప్పాలని పోలీసులు కోరారు.

News February 18, 2026

కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి అబద్ధాల కోరు: కాంగ్రెస్ నేతలు

image

కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కన్న తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర ఉన్న MLAకు, షబ్బీర్ అలీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్‌లో అబద్ధాలు చెప్పారని, రూ.150 కోట్ల అభివృద్ధిపై ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఐటీ శాఖకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

News February 18, 2026

ADB: బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

ఐటీఐ 2 సంవత్సరాల కోర్సులో పాసైన విద్యార్థుల నుంచి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలోకి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 21లోపు సర్టిఫికెట్‌లతో కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 60% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్ష మార్చి 12న ఉంటుందన్నారు.