News February 28, 2025

ఆసిఫాబాద్‌: బర్డ్ ఫ్లూ.. భయపడుతున్న జనం

image

బర్డ్ ఫ్లూ వైరస్ ASF జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులకు ఇబ్బందులు పడుతున్నాయి. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో జనం చికెన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 250 పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు కాగజ్‌నగర్ పట్టణంలోని చికెన్ దుకాణ యజమానులు చికెన్ మేళా నిర్వహిస్తున్నారు.

Similar News

News December 25, 2025

పిల్లలు త్వరగా పడుకోవాలంటే..

image

ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు లేటుగా పడుకొని ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలు ప్రతిరోజు ఒకే వేళకు నిద్రపోయేలా, ఒకే సమయానికి లేచేలా చూడాలి. దాంతో చక్కగా నిద్రపట్టి మెదడు చురుకుగా పనిచేస్తుంది. రాత్రిళ్లు పిల్లలు ఫోన్, టీవీ చూడకుండా వారికి ఆసక్తి కలిగించే కథలు చెప్పాలి. దీంతో త్వరగా నిద్రపోతారు. పిల్లలను నిద్రపుచ్చే సమయానికి గది వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలి.

News December 25, 2025

భీమవరం డీఎస్పీ బదిలీ

image

AP: భీమవరం డీఎస్పీ <<18073175>>జయసూర్యను<<>> డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్‌‌ విష్ణును నియమించారు. జయసూర్యపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ చేయాలని అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ డీజీపీకి లేఖ రాశారు. ఆయన పేకాట నిర్వహణకు సహకరిస్తున్నారని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే జయసూర్య మంచి అధికారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ అప్పట్లో కితాబిచ్చారు.

News December 25, 2025

ప.గో: పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసిన డీఎస్పీపై బదిలీ వేటు

image

భీమవరం డీఎస్పీగా రఘువీర్ విష్ణుని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీఎస్పీ జయసూర్య పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మార్పు జరిగిందని ప్రచారం సాగుతోంది. జయసూర్యను మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తక్షణమే విధుల్లో చేరాలని కొత్త డీఎస్పీకి సూచించారు.