News December 30, 2024
ఆసిఫాబాద్: మంత్రి సీతక్కను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్కను ఆదివారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.
Similar News
News January 2, 2025
విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాలి: ASF కలెక్టర్
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. బుధవారం టీఎస్‌యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సమాజ నిర్మాణం తరగతి గదిలోనే ప్రారంభమవుతుందన్నారు. సామాజిక స్పృహ కలిగిన సంఘంగా కొత్త ఏడాదిలో నవ ఉత్తేజంతో పనిచేయాలని సూచించారు.
News January 1, 2025
నిర్మల్: ‘కేజీబీవీ విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు’
కేజీబీవీ ఉపాధ్యాయుల సమ్మె కారణంగా విద్యార్థులు తమ చదువును నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని డీఈవో రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు బోధిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఏ రకమైన సమస్యలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
News January 1, 2025
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు : ASF SP
శాంతి భద్రతల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా జనవరి 1 నుంచి 31వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం SP మాట్లాడుతూ.. DSP, ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతులు లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదన్నారు.