News February 24, 2025
ఆసిఫాబాద్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

శివరాత్రి రోజున నిర్వహించే జాతరకు ఆసిఫాబాద్ డిపో నుంచి 28 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు. వాంకిడి జాతరకు ఆసిఫాబాద్ నుంచి 3 బస్సులు, కాగజ్ నగర్ నుంచి ఈస్గామ్ 6, బెల్లంపల్లి నుంచి బుగ్గకు 15, ఆసిఫాబాద్ నుంచి నంబాలకు 4 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 6, 2025
కుకునూరుపల్లి: ‘భోజనం రుచికరంగా ఉండాలి’

కుకునూరుపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంట గదిలో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారమే ఆలుగడ్డ టమాటా పప్పు, బిర్యాని రైస్ వండినట్లుగా వంట సిబ్బంది తెలిపారు. ఆహార పదార్థాల నాణ్యత పరిశీలిస్తూ బిర్యాని, కూరల్లో నాణ్యత పెంచాలని, విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు.
News November 6, 2025
‘మోడల్ అంగన్వాడీ డిజైన్ ఛాలెంజ్’ ప్రారంభం

భద్రాద్రి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను ఆధునికంగా, సురక్షితంగా, పిల్లల స్నేహపూర్వక వాతావరణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోడల్ అంగన్వాడీ డిజైన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రస్తుత అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినప్పుడు సౌకర్యాలు, భద్రత, సౌందర్యం, ప్రాప్యత, పర్యావరణ స్థిరత్వం వంటి అంశాల్లో మెరుగుదలకు విస్తృత అవకాశాలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
News November 6, 2025
వరల్డ్ కప్ విజేతలకు కార్లు గిఫ్ట్ ఇవ్వనున్న TATA

మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. త్వరలో విడుదల కానున్న Tata Sierra SUV మొదటి బ్యాచ్‌లోని టాప్ఎండ్ మోడల్‌ను జట్టులోని ప్రతి సభ్యురాలికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. WC విజేతలు & రీఎంట్రీ ఇస్తున్న లెజెండరీ సియెర్రా రెండూ పట్టుదల, ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకలని టాటా మోటార్స్ కొనియాడింది. కాగా ఈ కారు నవంబర్ 25న లాంచ్ కానుంది.


