News February 24, 2026
ఆసిఫాబాద్: మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు: ఎస్పీ

త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ASF జిల్లా ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, తప్పుడు నంబర్ ప్లేట్లు, శబ్ద కాలుష్యం సృష్టించే వారిపై చర్యలు తప్పవన్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయన్నారు.
Similar News
News February 25, 2026
NRPT: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఎస్పీ

ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో బుధవారం నారాయణపేట పట్టణంలోని గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డీఎస్పీ లింగయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతను సమీక్షించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని అన్నారు.
News February 25, 2026
2 నుంచి శ్రీవారి కానుక వస్త్రాల వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు TTD అనుబంధ దేవస్థానాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలు(మొత్తం 287 లాట్లు) ఆన్‌లైన్ ఈ-వేలానికి ఉంచుతున్నారు. ఆర్ట్ సిల్క్ చీరలు, హాఫ్ శారీస్, సిల్క్ చీరలు, ఆర్డినరీ చీరలకు మార్చి 2వ తేదీ 9వ తేదీ వరకు AP ఈ-కొనుగోలు పోర్టల్‌లో EA ID Nos. 25597–25602, 25604–25609 ద్వారా వేలం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు AP ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
News February 25, 2026
‘లుకౌట్’.. ఇది నేరస్థులను పట్టుకునే ఆయుధం

యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు ఈ నోటీసులు జారీ చేస్తారు. దీనివల్ల నిందితుడి వివరాలు అన్ని విమానాశ్రయాల్లోని ఇమిగ్రేషన్ అధికారులకు అందుతాయి. ఫలితంగా నిందితుడు విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా తిరిగి వచ్చినప్పుడు కూడా తెలిసిపోతుంది. పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకోవడానికి ఇది ఒక శక్తిమంతమైన ఆయుధం.


