News November 3, 2025
ఆసిఫాబాద్: 7 మద్యం షాపులకు.. రేపే లక్కీ డ్రా

ఆసిఫాబాద్ జిల్లాలో మిగిలిన 7 మద్యం దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ASF జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. జిల్లాలో 32 మద్యం దుకాణాలకు అక్టోబర్ 27న 25 మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. 7 షాపులకు డబల్ డిజిట్ రానందున వాయిదా వేశారు. వాయిదా వేసిన షాపులకు రేపు లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
Similar News
News November 3, 2025
పరవాడ: తీరానికి కొట్టుకు వచ్చిన విద్యార్థి మృతదేహం

పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం సముద్రతీరంలో స్నానం చేస్తుండగా ఈనెల 1వ తేదీన గల్లంతైన విద్యార్థి భాను ప్రసాద్ (15) మృతదేహం ఆదివారం అదే తీరానికి కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతిని తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 3, 2025
పెన్షన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

భర్త మరణించి మూడేళ్లు గడిచినా పెన్షన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు గోపవరం(M) సండ్రపల్లికి చెందిన చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా సచివాలయ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. అధికారులు కరుణించి, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నట్లు ఆమె కనీటి పర్యంతమయ్యారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
News November 3, 2025
‘పుల్లోరం’ కోడి పిల్లలకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


