News March 14, 2025

ఆసిఫాబాద్: PHOTO OF THE DAY

image

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చిన్నారులు రంగులు పూసుకొని సందడి చేసిన ఫొటో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలు గ్రామాల్లో చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. మీ ప్రాంతంలో హోలీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.

Similar News

News March 17, 2025

NGKL: వలస కార్మికుడి మృతి

image

కొల్లాపూర్ మండలంలో ఓ వలస కార్మికుడు మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. అస్సాంలోని మాదాపూర్‌కి చెందిన వినోద్‌దాస్(35) ఎల్లూరు శివారులో కొనసాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేసేందుకు వలస వచ్చాడు. ఆదివారం మద్యం తాగి నడుస్తుండగా రాయి తగిలి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

News March 17, 2025

MBNR: చెరువులో మునిగి వ్యక్తి మృతి

image

జిల్లాకేంద్రంలో ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. వేపూరిగేరికి చెందిన అశోక్(38) ప్రింటింగ్ ప్రెస్‌లో రోజువారి వర్కర్‌గా పనిచేస్తున్నారు. అయితే హోలీ ఆడిన తర్వాత మద్యం తాగి వెంకటాపూర్ శివారులో ఉన్న చెరువులో స్నానం కోసం వెళ్లాడు. నీటిలోకి దిగిన తర్వాత నీట మునిగిపోవటంతో ఊపిరి ఆడక మృతిచెందాడు. రెండు రోజుల తర్వాత మృతదేహం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదైంది.

News March 17, 2025

బీసీ రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలి:మంత్రి పొన్నం

image

బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనుండడంతో బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడాగట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి సమావేశం నిర్వహించారు.  మొదటిసారి చారిత్రాత్మక బీసీ రిజర్వేషన్ పెంచుతూ బిల్లు ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. మంత్రి కొండ సురేఖ, విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

error: Content is protected !!