News March 2, 2026
ఆసియా మార్కెట్లపై వార్ ఎఫెక్ట్

గల్ఫ్ వార్ ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే జపాన్, కొరియా మార్కెట్లు డౌన్ అయ్యాయి. హార్ముజ్ జలసంధి నుంచి ఓడల రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధర 13% పెరిగింది. ఇవాళ భారత స్టాక్ మార్కెట్లలో కూడా బ్లడ్ బాత్ తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఇవాళ మరోసారి పెరుగుదల తప్పేలా లేదు.
Similar News
News March 9, 2026
చిరంజీవి రాంగ్ టైమ్‌లో పార్టీ పెట్టారు: శివాజీ

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై నటుడు శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిరంజీవి రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ పెట్టి ఉండాల్సింది. అలా అయితే సీమాంధ్రలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవారు. రాంగ్ టైమ్‌లో పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల వరకైనా పార్టీని కొనసాగించి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవారేమో’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
News March 9, 2026
ట్రోఫీతో గుడికి.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

1983 WC విజేత, TMC MP కీర్తి ఆజాద్ టీమ్ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. T20 WC ట్రోఫీతో <<19333290>>హిందూ ఆలయానికి<<>> వెళ్లడాన్ని తప్పుబట్టారు. టీమ్ఇండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని.. కేవలం ఒక మతానిదో లేదా జై షా కుటుంబానిదో కాదని విమర్శించారు. సిరాజ్ మసీదుకు లేదా శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకెళ్లలేదన్నారు. ఒకే మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.
News March 9, 2026
గ్యాస్ కొరత.. బెంగళూరులో హోటల్స్ బంద్!

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపేయడంతో హోటళ్లను ఆపరేట్ చేయలేకపోతున్నామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పశ్చిమాసియాలో యుద్ధం వల్ల వాణిజ్య వంట గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. రేపటి నుంచి బెంగళూరులోని రెస్టారెంట్లు బంద్ అవుతాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది.


