News December 19, 2025

ఆసియా యూత్ పారా గేమ్స్‌లో సత్తా చాటిన హైదరాబాద్ బాలిక

image

ఆసియా యూత్‌ పారా గేమ్స్‌లో తెలుగు ప్లేయర్ గంగపట్నం విజయ దీపిక టేబుల్‌ టెన్నిస్‌లో స్వర్ణం, కాంస్యం గెలిచింది. హైదరాబాద్‌‌కు చెందిన దీపిక టీటీ మిక్స్‌డ్‌ డబుల్స్‌‌లో స్వర్ణం, మహిళల సింగిల్స్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. 15 ఏళ్ల దీపిక కాంటినెంటల్‌ స్థాయిలో స్వర్ణం గెలిచిన పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. దీపిక తల్లి అరుణ వెటరన్ టెన్నిస్‌ ప్లేయర్‌. సోదరుడు విజయ్ తేజ్ జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్‌.

Similar News

News December 19, 2025

ప్రపంచంలో టాప్ రిచ్ ఫ్యామిలీస్ ఇవే!

image

ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబాల జాబితాను బ్లూమ్‌బర్గ్ రిలీజ్ చేసింది. టాప్ 25 రిచ్ ఫ్యామిలీస్ సంపద $2.9 ట్రిలియన్లకు చేరుకుందని తెలిపింది. టాప్ 10 ఫ్యామిలీస్..
*వాల్టన్ (US)-$513.4B *అల్ నహ్యాన్(UAE)-$335.9B
*అల్ సౌద్ (సౌదీ)-$213.6B *అల్ థానీ(ఖతర్)-$199.5B
*హీర్మేస్(ఫ్రాన్స్)-$184.5B *కోచ్(US)-$150.5B
*మార్స్(US)-143.4B *అంబానీ(భారత్)-$105.6B
*వెర్థీమర్(ఫ్రాన్స్)-$85.6B *థామ్సన్(కెనడా)-$82.1B

News December 19, 2025

సర్పంచ్ సాబ్.. కోతులనెప్పుడు తరిమేస్తావ్?

image

కొత్త సర్పంచులకు ముందున్న అసలు సవాల్ ప్రతిపక్షం కాదు. కోతి మూకలే. ఎన్నికల మ్యానిఫెస్టోలో రోడ్లు, డ్రైనేజీల కంటే ‘కోతుల రహిత గ్రామం’ అనే హామీకే ఓటర్లు మొగ్గు చూపారు. ఇప్పుడు గెలిచిన తొలి రోజే కోతులు సర్పంచులకు స్వాగతం పలుకుతున్నాయి. పంటలను, ప్రజలను వానరాల నుంచి కాపాడటం కొత్త నాయకులకు అగ్నిపరీక్షగా మారింది. కోతులను తరిమికొట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో లేక అవి పెట్టే తిప్పలకు తలొగ్గుతారో చూడాలి.

News December 19, 2025

స్టైలిష్‌గా చిరంజీవి.. OTTలోకి కొత్త సినిమాలు

image

✦ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి చిరంజీవి కొత్త స్టిల్స్ విడుదల.. యంగ్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్న మెగాస్టార్.. ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్‌లో మల్టీపుల్ డైమెన్షన్స్ ఉంటాయన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి
✦ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ప్రియదర్శి, ఆనంది నటించిన ‘ప్రేమంటే’ మూవీ
✦ అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా