News September 13, 2024
ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆదిమూలం

లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో మధ్య చెన్నై అపోలో నుంచి ఆదిమూలం డిశ్ఛార్జి అయి ఇంటికి వచ్చారు. ఆయన పుత్తూరు నివాసానికి చేరుకున్నారని సమాచారం. ఆయన గన్‌మెన్, పీఏ సహా బంధుమిత్రులకు, పార్టీ శ్రేణులకు ఎవరికీ అనుమతి లేదని సమాచారం. బుధ, గురువారాల్లో TPT ఇంటెలిజెన్స్ పోలీసులు ఎమ్మెల్యేను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ గుండెకు స్టంట్ వేయించుకున్నానని రెండ్రోజుల్లో తానే వచ్చి కలుస్తానని ఆయన చెప్పారు.
Similar News
News February 22, 2026
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.144 నుంచి రూ.150, మాంసం రూ.209 నుంచి 234 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.238 నుంచి రూ.260 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 75 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 21, 2026
పలమనేరు: APO సస్పెండ్.. అసిస్టెంట్లకు నోటీసులు..!

పలమనేరు ఉపాధి హామీ పనుల్లో <<19204298>>అవినీతి<<>> జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్‌లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.
News February 21, 2026
ZP ఛైర్మన్ ఫిర్యాదుతో విషయం బయటకు..!

అధికార పార్టీ నేతల అండదండలతో పలమనేరులో ఉపాధి హామీ పనుల్లో భారీ <<19204272>>అవకతవకలు<<>> జరిగాయని చిత్తూరు ZP ఛైర్మన్ కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వేజెస్ రూపంలో అందించే నగదును ఏపీఓ, అసిస్టెంట్లు తమ సొంత అకౌంట్లకు బదిలీ చేసుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదికను సమర్పించాలని డ్వామా పీడీకి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.


