News August 14, 2024
ఆసుపత్రులపై వచ్చే ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులపై వచ్చే ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, PHC కేంద్రాలలోని డాక్టర్లు , సిబ్బంది వారి వారి ఆసుపత్రులపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆయన కోరారు. వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు.
Similar News
News October 30, 2025
NLG: నిత్య పూజలకు నోచుకోని శివయ్య

శాలిగౌరారంలోని శివాలయంలో నిత్యపూజలు జరగకపోవడం పట్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ గుండా దుర్గయ్య నల్గొండలోని ఎండోమెంట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఆలయ పూజారి రాంబాబు నిత్య పూజలు చేయడానికి రావడం లేదని ఫిర్యాదు చేశారు. నెల రోజుల క్రితం ఎండోమెంట్ ఈవో రుద్రారం వెంకటేశ్వర్లుకు నిత్య పూజ చేస్తానని పెద్దమనుషుల సమక్షంలో రాసిచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా పూజారి రావడం లేదన్నారు.
News October 29, 2025
దేవరకొండ బడిలోకి చేరిన వరద.. మంత్రి కోమటిరెడ్డి ఆరా

దేవరకొండ(M) కొమ్మేపల్లి ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ పాఠశాలలోకి వర్షపు నీరు చేరిన ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరా తీశారు. కొమ్మేపల్లి ST వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, లోతట్టు ప్రాంతంలో ఉండడం వంటి కారణాల వల్ల హాస్టల్లోకి నీరు ప్రవేశించిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రికి వివరించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
News October 29, 2025
విషాదం: 10 రోజులకే వీడిన బంధం.. నవవధువు మృతి

NLG: గుర్రంపోడు(M)లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. చామలేడుకు చెందిన సిలువేరు నవీన్, 10 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తన భార్యతో కలిసి బైక్‌పై గుర్రంపోడుకు వెళుతున్నారు. వారు బ్రిడ్జిపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా మలుపు తిప్పుతున్న మరో బైక్‌ను చూసి నవీన్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దంపతులిద్దరూ బైక్‌పై నుంచి ఎగిరి పడగా ఈ దుర్ఘటన జరిగింది.


