News December 17, 2025
ఆస్కార్ 2026 షార్ట్‌లిస్ట్‌లో ‘హోమ్‌బౌండ్’

భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ మూవీ 98వ అకాడమీ అవార్డులలో ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో టాప్-15లో చోటుదక్కించుకుంది. కేన్స్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆస్కార్ రేసులోకి దూసుకెళ్లింది. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు స్నేహితులకు ఎదురైన సవాళ్లే ఈ మూవీ కథ.
Similar News
News March 3, 2026
వీధి కుక్కలతోనూ బ్రాండ్ మార్కెటింగ్!

యాడ్స్ కోసం సంస్థలు హోర్డింగ్‌లు, కటౌట్‌లపై ఖర్చు చేసే బదులు సింపుల్‌గా వీధి కుక్కలను వాడుకుంటే ఎలా ఉంటుంది? ఆదిత్య అనే ఓ మాజీ మైక్రోసాఫ్ట్ టెకీకి వచ్చిన ఐడియా ఇది. ‘Stray as a Service’ అనే పేరుతో ఏఐ ఫొటోస్ కూడా షేర్ చేశారు. దేశంలో దాదాపు 3 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని వీటిని యాడ్స్‌కు వాడుకుంటే ఖర్చు తగ్గి, అవి తిరిగేచోటల్లా బ్రాండ్ ప్రమోట్ అవుతుందన్నారు. మరి ఈ ఐడియా ఎలా ఉంది? కామెంట్ చేయండి.
News March 3, 2026
హార్ముజ్ బంద్.. భారత్‌కు నిలిచిన క్రూడాయిల్

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్‌తో ‘హార్ముజ్ జలసంధి’ వద్ద షిప్పుల మూవ్‌మెంట్ ఆగిపోయింది. దీనివల్ల భారత్‌కు వచ్చే చమురు దిగుమతులు దారుణంగా పడిపోయాయి. Febలో రోజుకు 28 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ఈ మార్గం ద్వారా భారత్‌కు వచ్చింది. మార్చి 1 నాటికి అది ‘సున్నా’కు పడిపోయింది. మన దేశానికి కావాల్సిన 50% చమురు, దాదాపు 100% LPG ఈ రూట్ నుంచే వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% ఇక్కడి నుంచే వెళ్తుంది.
News March 3, 2026
ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్‌ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.


