News February 1, 2026

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే

image

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. వరల్డ్ నెంబర్-1, స్పెయిన్ స్టార్ అల్కరాజ్, సెర్బియా వీరుడు జకోవిచ్ మధ్య నేడు తుదిపోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టెన్నిస్‌లో అత్యధికంగా 25 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా జకోవిచ్ అవతరిస్తారు. అల్కరాజ్ నెగ్గితే కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నారు. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్సుంది.

Similar News

News February 13, 2026

రాహుల్‌పై నోటీసు… స్పీకర్ నిర్ణయంపై ఆసక్తి

image

రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని BJP MP నిశికాంత్ దూబే సబ్‌స్టాంటివ్ మోషన్ నోటీసు ఇవ్వడం తెలిసిందే. దీనిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. దీన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించడంపై స్పీకర్ నిర్ణయించాలి. అది విచారించి ఇచ్చిన సిఫార్సును సభ ఆమోదానికి పెట్టాలి. సభ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చర్య చేపడతారు. గతంలో మొహువా మొయిత్రా (TMC MP)ని ఎథిక్స్ కమిటీ సిఫార్సుతో బహిష్కరించారు.

News February 13, 2026

మార్కెట్ల పతనం.. ₹7 లక్షల కోట్లు ఉఫ్!

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బేర్ గుప్పిట్లో చిక్కుకొని విలవిల్లాడాయి. సెన్సెక్స్ 1,048 Pts కుంగి 82,626 వద్ద, నిఫ్టీ 336 Pts క్షీణించి 25,471 దగ్గర స్థిరపడ్డాయి. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, SBI మాత్రమే లాభపడ్డాయి. HUL, ఎటర్నల్, TATA స్టీల్, టైటాన్ భారీగా నష్టపోయాయి. దాదాపు ₹7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఐటీ స్టాక్స్ డౌన్‌ఫాల్ మార్కెట్ల పతనాన్ని శాసించింది.

News February 13, 2026

విశ్వక్ సేన్ ‘funky’ రివ్యూ&రేటింగ్

image

దర్శకుడు కావాలనుకున్న ఓ యువకుడు ఏ ఇబ్బందులు పడ్డాడు, ఎలా అధిగమించాడనేదే కథ. డైరెక్టర్ అనుదీప్ సింగిల్ లైనర్స్ కామెడీ ఫస్టాఫ్‌లో కొన్నిచోట్ల ఆకట్టుకుంటుంది. మిగతావి రిపీట్, ఔట్‌డేటెడ్ అన్పిస్తాయి. ఇక కథలో లాజిక్, ఎమోషన్ మిస్ కావడం మైనస్. భీమ్స్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ఎడిటింగ్ మరో మైనస్. విశ్వక్ సేన్, కయాదు లోహర్ నటన బాగున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఫర్వాలేదు.
రేటింగ్: 2/5