News December 29, 2024

ఆస్ట్రేలియాలో సెల్ఫీలు అడుగుతున్నారు: నితీశ్ తండ్రి

image

విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతని తండ్రి ముత్యాలరెడ్డి ఆనందానికి హద్దులే లేవు. ఉంటున్న ప్రాంతంలోని వారికే నేను ఎవరో తెలీదు అలాంటిది ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే సెల్ఫీలు అడుగుతున్నారంటూ మురిసిపోయారు. ఆస్ట్రేలియా వచ్చినప్పడు ఇంత దూరం వచ్చినందుకు గర్వపడుతున్నా అనగా ఇది చాలదు ఇంకా చూపిస్తా అంటూ 24 గంటల్లోనే సెంచరీ చేశాడన్నారు.

Similar News

News February 28, 2026

విశాఖ మీదుగా రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. విశాఖపట్నం-కొల్లాం (18501) మంగళవారాల్లో, చర్లపల్లి-షాలిమార్ అమృత్ భారత్ (17065) మంగళవారాల్లో నడుస్తాయి. ఇవి విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయి. త్వరలోనే వీటి ప్రారంభ తేదీలను వెల్లడిస్తామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ తెలిపారు.

News February 28, 2026

శంకుస్థాపలు సరే.. శిలఫలకాలు వేయరేం: ఎమ్మెల్యే

image

జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. శంకుస్థాపనల అనంతరం శిలాఫలకాలు ఏర్పాటు చేయడం లేదని దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతిరోజు ఎంతమంది పారిశుధ్య కార్మికులు హాజరవుతున్నారు? ఏ పనులు చేస్తున్నారనే అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. 15 సంవత్సరాలుగా ఒకే వార్డులో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను మార్చాలని డిమాండ్ చేశారు.

News February 28, 2026

విశాఖలో నేటి నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్

image

విశాఖలో ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ‘టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (TCCL) ప్రారంభం కానుంది. సినీ నటులు శ్రీకాంత్, తరుణ్ నేతృత్వంలో సుమారు 110 మంది సినీ, టీవీ ప్రముఖులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. పేద విద్యార్థుల చదువులకు చేయూతనిచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.