News January 3, 2026
ఆస్ట్రోనాట్స్‌కు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తీసేస్తారు

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తొలగిస్తారట. సాధారణంగా వీటితో సమస్యలుండవు. కానీ ఇబ్బంది వస్తే త్వరగా తొలగించాలి. అందుకే.. అంతరిక్షంలో ఉండగా వీటి సమస్య వస్తే కష్టమని ముందే ఆపరేషన్ చేస్తారట. ఇటీవలే స్పేస్‌లోకి వెళ్లొచ్చిన శుభాంశు శుక్లా ఈ విషయం వెల్లడించారు. సెల్ఫ్ ట్రీట్మెంట్‌పై ట్రైనింగ్ ఇస్తారని, ఆపరేషన్లు లాంటివి మాత్రం అక్కడి జీరో గ్రావిటీలో చేసుకోలేమన్నారు.
Similar News
News February 7, 2026
మేకిన్ ఇండియాకు బలం.. ట్రేడ్ డీల్‌పై మోదీ

ఇండియా, US <<19072293>>ఒప్పందం<<>>పై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘2 దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం ట్రంప్ చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు. ఈ ఫ్రేమ్‌వర్క్ రైతులు, MSMEs, స్టార్టప్‌లు, జాలర్లు, మరెందరికో కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తుంది. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుంది. ప్రజలను శక్తిమంతం చేసే ప్రపంచ భాగస్వామ్యాలను నిర్మించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.
News February 7, 2026
మారుతీ సుజుకీకి షాక్.. చిన్న కార్ల రాయితీ ప్రతిపాదన రద్దు

చిన్న కార్లపై (909 కేజీలు లేదా అంతకంటే తక్కువ బరువు ఉండేవి) రాయితీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో మారుతీ సుజుకీకి ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్లో దాదాపు 95% చిన్న కార్లు మారుతీవే ఉన్నాయి. దీంతో రాయితీ ఎక్కువగా ఒక సంస్థకే లాభం చేకూరుస్తుందన్న ఇతర కంపెనీల అభ్యంతరాలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా రూపొందిస్తున్న CAFE-III రూల్స్ 2027 ఏప్రిల్‌లో అమల్లోకి రానున్నాయి.
News February 7, 2026
బ్యూటీ యాంగ్జైటీకి గురవుతున్నారా?

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.


