News April 17, 2025

ఆస్తికోసం తమ్ముడిపై అన్న కత్తితో దాడి

image

ఆస్తిలో వాటా అడిగిన తమ్ముడి కళ్లలో కారం చల్లి అన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దమండ్యం మండలానికి చెందిన సుధాకర్ రెడ్డికి తన అన్న వెంకటరమణారెడ్డికి మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సుధాకర్ రెడ్డి అన్నను ఆస్తిలో వాటా పంచాలని పొలం దగ్గర నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన వెంకటరమణారెడ్డి తమ్ముడి కళ్లలో కారం చల్లి కత్తి దాడిచేశాడు.

Similar News

News April 19, 2025

ఖమ్మం: రేపటి నుంచి పదో తరగతి ఓపెన్ పరీక్షలు

image

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ 2025 థియరీ పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ఈ నెల 26 వరకు నిర్వహిస్తున్నట్లు డిఇఓ సోమశేఖర శర్మ తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 8 పరీక్షా కేంద్రాల్లో 1553 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.

News April 19, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓:రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ✓: కూసుమంచిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ✓: తల్లాడలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ✓:ఏన్కూర్: వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ✓:జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ✓: కారేపల్లిలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ✓: పలు శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం ✓: ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 19, 2025

HYDలో తరచూ కనిపిస్తున్న చిరుత

image

నగరంలోని పలు ప్రాంతాల్లో 2014 నుంచి చిరుతలు కనిపిస్తున్నాయి. మొదటిసారి 2014లో ఇక్రిశాట్లో కనిపించగా జూన్ 2019లో మళ్లీ ఇక్రిశాట్‌లో కనిపించింది. ఆ తరువాత జనవరి 2020లో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో, డిసెంబర్ 2022లో హెటిరో డ్రగ్స్ ప్లాంట్‌లో, మే 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ భూముల్లో, జనవరి 2025లో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో.. ఇపుడు మళ్లీ ఇక్రిశాట్లో చిరుతలు కనిపించాయి.

error: Content is protected !!