News April 25, 2025
ఆస్తి గొడవ.. ముగ్గురి జైలుశిక్ష: ఏర్పేడు సీఐ

ఏర్పేడు మండలం ముసలిపేడులో 2017 మే 11న జరిగిన హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. ముగ్గురికి జీవితకాలం కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ శ్రీకాళహస్తి 12వ అడిషనల్ జిల్లా జడ్జి శ్రీనివాసులు నాయక్ తీర్పు చెప్పారని ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. ఆస్తి గొడవల కారణంగా సుజాత, ఆమె భర్త, తల్లి వెంకటేశులు, రాణెమ్మతో కలిసి సుజాత అన్న సుబ్రహ్మణ్యం భార్య సుబ్బమ్మను హత్యచేశారు.
Similar News
News April 25, 2025
గద్వాల: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి PS పరిధిలో జరిగింది. SI మహేశ్ తెలిపిన వివరాలు.. బొంకూరు గ్రామ వాసి K.మధు(34) బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. అనంతరం తనకు తెలిసిన వ్యక్తి రాముడికి ఫోన్ చేసి ‘మా తాతల ఆస్తి నాకు సరిగా పంచలేదు.. అందుకే పొలం వద్ద పురుగు మందు తాగి చనిపోతున్నా’ అని చెప్పాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కేసు నమోదైంది.
News April 25, 2025
HYD: మూసీ ప్రాజెక్ట్.. భూ పరీక్షలకు బిడ్లు ఆహ్వానం

మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూసీ ప్రాజెక్టు అభివృద్ధిపై చక చకా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే మీర్‌అలం ట్యాంకు వద్ద భూ పరీక్షలు నిర్వహించేందుకు బిడ్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. మూసీకి ఆనుకుని ఉన్న భూమి పరిస్థితి, భూబలం, ఇతర సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఈ పరీక్షలు తోడ్పడనున్నాయి.