News December 22, 2025
ఆస్తి పన్ను బకాయిలపై భారీ డిస్కౌంట్

TG: ఆస్తి పన్నుకు సంబంధించి HYD వాసులకు ప్రభుత్వం ‘వన్ టైం స్కీమ్’ (OTS) ప్రకటించింది. తాజాగా విడుదలైన G.O.Rt.No.869 ప్రకారం పాత బకాయిలపై ఉన్న వడ్డీలో 90% రద్దు చేస్తోంది. అసలు పన్ను మొత్తంతో పాటు కేవలం 10% వడ్డీని ఒకేసారి చెల్లిస్తే సరిపోతుంది. ప్రైవేట్ యజమానులకు, ప్రభుత్వ సంస్థలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Similar News
News December 23, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

మీరు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారా? వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ చేయించుకోవడం ద్వారా వైకుంఠ ద్వారం తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొంది, అన్ని పాపాల నుంచి విముక్తి చెంది, శ్రేయస్సుతో కూడిన మోక్ష మార్గాన్ని పొందండి. మీ పేరు & గోత్రంతో సంకల్పం నమోదు చేసుకుని వెంటనే వేదమందిర్‌లో <
News December 23, 2025
ఉద్యోగాలు లేక విదేశాలవైపు యువత చూపు!

విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ యువతే ఎక్కువగా ఉందని <<18646531>>నీతి ఆయోగ్<<>> స్పష్టం చేసింది. యువతకు ఉద్యోగాలు దొరకకపోవడం కూడా దీనికి ఒక కారణంగా తెలుస్తోంది. 2025లో రాష్ట్రంలో నిరుద్యోగం 8 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు(5.2%) కంటే ఎక్కువ. నిరుద్యోగుల్లో ఎక్కువమంది డిగ్రీ చేసిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉన్నా నాణ్యమైన ఇన్‌స్టిట్యూట్స్ లేవని యువత భావిస్తోంది.
News December 23, 2025
క్లుప్తంగా చెప్పాలంటే ఇదే రైతు జీవితం..

వర్షం కాన రాదు.. కరవు పోదు.. కష్టం తరగదు.. ప్రకృతి తీరు మారదు.. బ్యాంకు రుణం తీరదు.. కన్నీళ్ల తడి ఆరదు.. రేపటి మీద ఆశ చావదు.. క్లుప్తంగా చెప్పాలంటే అన్నదాత జీవితం ఇదే. చేతి నిండా అప్పులున్నా, పేదరికం పగబట్టినా, నిరాశ ఆవహిస్తున్నా, నిస్సహాయుడిగా మిగిలినా.. తాను నమ్ముకున్న భూమి ఏనాటికైనా తన కష్టం తీరుస్తుందన్న నమ్మకంతో బతికే ఆశాజీవి ‘రైతు’ మాత్రమే. అన్నదాతలకు ‘జాతీయ రైతు దినోత్సవ’ శుభాకాంక్షలు.


