News April 2, 2025

ఆస్తి పన్ను వసూళ్లు.. నాలుగో స్థానంలో మంచిర్యాల

image

2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్‌లో లక్షట్టిపేట మున్సిపాలిటీ 70.22 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ 56.25శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 64.73 శాతంతో 4వ స్థానంలో నిలిచింది. మందమర్రి 76.86%, క్యాతనపల్లి 76.14%, చెన్నూరు 61.05 శాతం పన్ను వసూళ్లు చేపట్టాయి.

Similar News

News November 5, 2025

కొనరావుపేట: అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభ్యం

image

కొనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్లో అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31న నిజామాబాద్‌కు చెందిన బద్దెపురి నారాయణ(80) కనిపించకుండా పోయాడు. వృద్ధుడి కుమారుడు నవంబర్ 3న కొనరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన వృద్ధుడి మృతదేహం రిజర్వాయర్లో కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 5, 2025

రాజమండ్రి: సాయిబాబా శత జయంతికి కలెక్టర్‌కు ఆహ్వానం

image

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి సందర్భంగా పుట్టపర్తిలో ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కలెక్టర్ చేకూరి కీర్తికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు బుధవారం ఆహ్వాన పత్రిక అందించారు. ఉత్సవాలకు ప్రధాని మోదీతో హాజరవుతున్నారని తెలిపారు. కలెక్టర్ తప్పనిసరిగా విచ్చేయాలని వారు కోరారు.

News November 5, 2025

నవంబర్ 10-19 వరకు సమ్మేటివ్ పరీక్షలు

image

AP: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో నిర్వహించే సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 10 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5వ తరగతులకు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు, 6, 7 క్లాసులకు మ.1.15 నుంచి సా.4.15 వరకు జరుగుతాయి. 8-10 తరగతులకు ఉ.9.15 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తరగతుల పరీక్ష పేపర్ల నమూనా వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచింది.