News November 19, 2025

ఆస్పత్రి బెడ్‌షీట్‌లు ఈ రంగులోనే ఎందుకు?

image

ఏదోక రుగ్మతతో ఆస్పత్రికి వెళ్లే ఉంటారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో బ్లూ, గ్రీన్ బెడ్‌షీట్‌లే ఎక్కువగా ఉంటాయని ఆలోచించారా? RBGకి ప్రాథమిక రంగుల స్వభావం ఉంటుంది. గ్రీన్‌, బ్లూ క్లాత్‌పై బ్లడ్ పడితే దాని ప్రభావం తగ్గి, నల్లటి ఛాయగా కనిపిస్తుంది. వేరే రంగు వస్త్రాలపై రక్తం పడితే అది డార్క్‌ రెడ్‌గా కనిపించి, హిమోఫోబియా ఉన్నవారు భయపడకుండా ఈ కలర్స్‌వి వేస్తారు. ఉతికాక వీటి రంగు వెలిసినా తేడా తెలియదు.

Similar News

News April 10, 2026

IPL: నేడు తొలి ఓటమిని రుచి చూసేదెవరో?

image

IPLలో ఈరోజు గువాహటి వేదికగా RCB, RR మధ్య 7.30PM నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. RR ఆడిన 3 మ్యాచులూ గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. RCB 2 విజయాలతో మూడో స్థానంలో ఉంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా RCB 17, RR 14 విక్టరీలు సాధించాయి. కాగా నేటి మ్యాచుకు వర్షం ముప్పు లేదని క్రిక్‌బజ్ పేర్కొంది.

News April 10, 2026

75% అటెండెన్స్ లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు!

image

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హాజరు 75% లేకపోతే పరీక్షలకు అనుమతించొద్దని, స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయనుంది. అలాగే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతి రోజే దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కాలేజీలో చేరిన రోజే విద్యార్థులకు ఫ్రీ స్టడీ మెటీరియల్ అందించనున్నారు.

News April 10, 2026

కర్నూలు: పిడుగు పడి మృతిచెందిన వ్యక్తి ఇతనే..!

image

ఎమ్మిగనూరు(M) ఏనుగుబాల గ్రామానికి చెందిన వలస కూలీ <<19610452>>పిడుగుపాటుకు<<>> గురై మృతి చెందిన ఘటన పల్నాడు(D) సత్తెనపల్లి(M) కట్టవారిపాలెంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పారే సురేశ్(21) మిరపకాయలు తెంపే పనికి వెళ్లాడు. ఆకస్మికంగా కురిసిన ఉరుములు మెరుపుల వర్షంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు జగన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి సత్తెనపల్లి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.