News March 26, 2024

ఆస్పరి: చేతి గుర్తు రక్తపు మరకలు

image

ఆస్పరిలోని బొరుగుల బట్టి యజమాని ఇంటి ఆవరణలో చేతి గుర్తు ఉండే రక్తపు మరకలు, పక్కనే RCM చర్చి ఆవరణలోని వెనుక భాగంలో రక్తం మడుగులా ఉండటంతో CI హనుమంతప్ప సోమవారం పరిశీలించారు. ఆ రక్తపు మడుగును చీపురుతో కడిగే ప్రయత్నం చేశారని, అక్కడే సబ్బు ముక్కలు ఉన్నాయని తెలిపారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌‌తో విచారణ చేపట్టామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. రక్తం మనిషిదా? జంతువుదా? తేలాల్సి ఉంది.

Similar News

News July 8, 2024

కర్నూలు: వెబ్సైట్‌లో ఇసుక నిల్వల వివరాలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఇవాళ నుంచి ఉచిత ఇసుక విధానం అమలవుతోంది. వినియోగదారులు ఇసుక సమాచారం వివరాలు https://www.mines.ap.gov.in/permit/ అనే వెబ్సైట్‌లో చూసుకోవాలని జిల్లా గనులు, భూగర్భ శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్ తెలిపారు. ఇసుక స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎంత నిల్వ ఉంది, తదితర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయని పేర్కొన్నారు.

News July 8, 2024

నంద్యాల: భూ తగదా.. వేట కొడవలితో దాడి

image

డోన్ మండలం వెంకటనాయునిపల్లెలో భూ తగాదా హత్యాయత్నానికి దారి తీసింది. స్థానికుల వివరాలు.. మాదయ్యను అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు చెన్నయ్య, ఇంద్రప్ప ఆదివారం సాయంత్రం వేట కొడవలితో తలపై నరికారు. తీవ్ర గాయాలైన మాదయ్యను వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News July 8, 2024

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండండి: నంద్యాల ఎస్పీ

image

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్లు తాము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని మీకు ఇన్సూరెన్స్ యాడ్ చేస్తామని ఒక యాప్ లింక్ పంపి దాంట్లో మీ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలని అడుగుతారని వివరాలు తెలపగానే క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు మాయం చేస్తారని తెలిపారు. ఎవరైనా ఫోన్ ద్వారా వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దని సూచించారు.