News January 6, 2026

ఆహార భద్రతపై పకడ్బందీ చర్యలు: అదనపు కలెక్టర్

image

భువనగిరి: జిల్లాలో ఆహార భద్రత నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం డిస్ట్రిక్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలు నిత్యం వినియోగించే ఆహార పదార్థాలు కల్తీ కాకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News January 9, 2026

హుస్సేన్‌సాగర్ చుట్టూ నైట్ బజార్!

image

హుస్సేన్‌సాగర్‌.. ప్రశాంతంగా ఉండే బుద్ధుడి విగ్రహం, NTR మార్గ్‌లో స్ఫూర్తినిచ్చే భారీ అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్‌పై ఉద్యమ స్ఫూర్తిని రగిల్చే తెలంగాణ అమరుల స్థూపం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అర్ధరాత్రి వరకు ఇక్కడ సందర్శకుల సందడి ఉంటుంది. ఇంకా ఆ పక్కనే తెలంగాణ సచివాలయం స్పాట్ అందరికీ ఫేవరెట్. వినోదం కోసం లుంబిని పార్క్, ఇందిరా పార్క్ ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో HMDA నైట్ బజార్‌కు ప్లాన్ వేస్తోంది.

News January 9, 2026

VKB: ఆంగ్లభాషపై పట్టు సాధించాలి: డీఈవో

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో టెడ్ టాక్ ఒలంపియాడ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా DEO రేణుకాదేవి మాట్లాడుతూ.. విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. విద్యార్థులు ఇంగ్లీష్‌పై పట్టు సాధించడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అలవర్చుకోవాలని తెలిపారు.

News January 9, 2026

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 13న తొలి విడత ముగుస్తుందని, ఆ తర్వాత మార్చి 9కి పార్లమెంట్ తిరిగి సమావేశం అవుతుందని వివరించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.