News February 4, 2026

ఆహార హరివిల్లు.. రంగుల్లో ఆరోగ్యం

image

మనం తినే పండ్లు, కూరగాయల రంగులకు ప్రత్యేక లక్షణాలుంటాయని మీకు తెలుసా? RED(టమాటా, పుచ్చకాయ) గుండెకు, YELLOW, ORANGE(క్యారెట్, నారింజ) కంటి చూపు, రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. GREEN(ఆకుకూరలు) కాలేయ శుద్ధికి, BLUE/PURPLE(వంకాయ, నల్ల ద్రాక్ష) చురుకుదనానికి తోడ్పడతాయి. WHITE(ముల్లంగి, కాలీఫ్లవర్) రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇలా రోజూ రంగురంగుల సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం! SHARE IT

Similar News

News February 4, 2026

అదరగొట్టిన ఇషాన్.. ఏకంగా 32 స్థానాలు ఎగబాకి

image

టీమ్ ఇండియా యంగ్‌స్టర్ ఇషాన్ కిషన్ ఐసీసీ T20I ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సీరీస్‌లో అదరగొట్టడంతో ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ ప్లేస్‌కి చేరుకున్నారు. టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్-11లో ఇషాన్ చోటు దక్కించుకుంటే రెండు వారాల్లోనే టాప్-10కు చేరుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అభిషేక్ శర్మ(917 పాయింట్లు) టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నారు.

News February 4, 2026

కిచెన్ గార్డెనింగ్ ఇలా ఈజీ

image

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. కిచెన్ ప్లాంట్స్‌కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్‌లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టొమాటో, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. సరిపడా నీరే పోయాలి. కుండీలకు రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.

News February 4, 2026

బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

image

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.