News August 12, 2025
ఆ ఇద్దరు దద్దమ్మలే.. జగదీశ్ రెడ్డి సెటైర్

ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులిద్దరూ దద్దమ్మలేనని మరోసారి రుజువైందని మాజీ మంత్రి, MLA జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఉదయసముద్రంను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడారు. కృష్ణా బేసిన్‌లోకి పుష్కలంగా నీరు వస్తుంటే చెరువులు నింపాల్సింది పోయి గేట్లు ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారన్నారు. జిల్లాలో చెరువులు నింపాలని డిమాండ్ చేశారు.
Similar News
News August 13, 2025
నల్గొండ: మెంటల్ రాజేశ్ అరెస్టు.. రెండు నెలల రిమాండ్

పలు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్న రౌడీ షీటర్ నలపరాజు రాజేశ్ అలియాస్ ‘మెంటల్ రాజేశ్’ను నల్లగొండ పోలీసులు వైజాగ్‌లో అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా కోర్టు విచారణలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న అతడిపై జిల్లా కోర్టు నాన్-బేలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి నిందితుడి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అతడిని అరెస్ట్ చేశారు.
News August 13, 2025
నల్గొండ: మహిళా మృతి కేసులో కార్ డ్రైవర్‌కు జైలు శిక్ష

అతివేగం, అజాగ్రత్తగా కారు నడిపి ఓ మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌కు NKL జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. 2015 మార్చి18న ఖమ్మం(D) వేపకుంటకు చెందిన అంగోతు కిశోర్ కారు నడుపుతూ HYD-VJDకు బయల్దేరాడు. మార్గమధ్యలో కట్టంగూర్(M) చెరువు అన్నారం క్రాస్ రోడ్డు వద్ద బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.
News August 13, 2025
నల్గొండ: జాతీయ త్రోబాల్‌కు NG కళాశాల విద్యార్థి ఎంపిక

తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర త్రోబాల్ సెలెక్షన్‌లో నాగార్జున ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఎంపికయ్యాడు. ఈ విద్యార్థి త్వరలో జార్ఖండ్‌లోని రాంచీ పట్టణంలో జరిగే నేషనల్ త్రో బాల్ సెలక్షన్‌లో పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. ప్రవీణ్ కుమార్‌ను వైస్ ప్రిన్సిపల్ పరంగి రవికుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్లు అభినందించారు.